వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ABN , First Publish Date - 2022-07-03T03:49:45+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ మండల కన్వీనర్ బయ్యన్న అన్నారు.
ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఆందోళన
ఉదయగిరి, జూలై 2: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీడీపీ మండల కన్వీనర్ బయ్యన్న అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుపై శనివారం నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, ఓబులరెడ్డి, ఖాన్‌సా, మహబూబ్‌బాషా, అబీద్, మాలకొండయ్య, వెంకటేశ్వరరెడ్డి, జల్సాయాదవ్, సుబ్బారెడ్డి, శివకృష్ణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.