Bapatla జిల్లా: సీఎం జగన్ రెడ్డిది (CM Jagan) కాపు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు (Srinivasarao) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాపు భవనాలను మూసివేశారని, నిర్మాణంలో ఉన్న వాటిని కూడా నిలిపి వేశారన్నారు. రాజకీయంగా, ఆర్దికంగా కాపులపై జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు దిగారని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో కాపులంతా ముఖ్యమంత్రి జగన్‌కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని గూడపాటి శ్రీనివాసరావు అన్నారు.
ఇవి కూడా చదవండి