‘అమరావతి నడిబొడ్డునే అంబేద్కర్ స్మృతివనాన్ని కొనసాగించాలి’

ABN , First Publish Date - 2020-07-11T01:10:47+05:30 IST

అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

‘అమరావతి నడిబొడ్డునే అంబేద్కర్ స్మృతివనాన్ని కొనసాగించాలి’

విశాఖపట్నం : అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు, దళిత జేఏసీ నేతలు శాఖమూరులోని అంబేద్కర్‌ స్మృతివనం ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. తాజాగా ఈ విషయమై విశాఖపట్నం జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి నడిబొడ్డునే అంబేద్కర్ స్మృతివనాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని.. అసలు కోర్టు జప్తు చేసిన స్ధలాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇదే జరిగితే అంబేదర్క్‌ను అవమానించినట్లేనని పుచ్చా మండిపడ్డారు.


శంకుస్ధాపనకు వెళ్లకుండా..! 

స్వరాజ్ మైదానంలోని 13 ఎకరాల స్ధలాన్ని 20 ఎకరాలుగా ఎందుకు చెప్పుకుంటున్నారు?. దళిత బాంధవుడినంటూ బూటకపు మాటలు చెబుతున్నారు. శంకుస్ధాపనకు వెళ్లకుండా జూమ్ యాప్‌లో ప్రారంభిస్తారా?. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దళితలపై కపటప్రేమ చూపిస్తున్నారు. దళితుల నుంచి 3వేల ఎకరాల ఎసైన్డ్ భూమిని ఎందుకు లాగేసుకున్నారు?. వైఎస్సార్ పార్టీ పేరును కూడా కొనుక్కున్నారు అని పుచ్చా విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-07-11T01:10:47+05:30 IST