నక్కా ఆనంద్ ఇంటికి మరోసారి రానున్న విశాఖ పోలీసులు

ABN , First Publish Date - 2021-10-19T13:43:30+05:30 IST

విశాఖ పోలీసులు ఈరోజు మరోసారి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి రానున్నారు. నర్సీపట్నం పోలీసులు గత రాత్రి ఆనంద్ బాబుకు ఇంటికి వచ్చారు.

నక్కా ఆనంద్ ఇంటికి మరోసారి రానున్న విశాఖ పోలీసులు

గుంటూరు:  విశాఖ పోలీసులు ఈరోజు మరోసారి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఇంటికి  రానున్నారు.  నర్సీపట్నం పోలీసులు గత రాత్రి ఆనంద్ బాబుకు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  విశాఖలో గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై మీడియా సమావేశంలో ఆనంద్ బాబు మాట్లాడిన అంశాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు అడిగారు. కాగా అర్థరాత్రి సమయంలో పోలీసులు రావడంపై నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఈరోజు  ఉదయం పది గంటలకు వస్తామని చెప్పి  పోలీసులు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-10-19T13:43:30+05:30 IST