వైసీపీ సర్కార్ ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు: Anand babu

ABN , First Publish Date - 2022-02-11T13:32:35+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ బాబును అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తీవ్రంగా ఖండించారు.

వైసీపీ సర్కార్ ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు: Anand babu

గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ బాబును అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే అశోక్ బాబు‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఉద్యోగులు హక్కులు కోసం మాట్లాడమే అశోక్ బాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రజా వ్యతిరేకతను ఆపలేరన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని ఆనందబాబు హెచ్చరించారు.

Updated Date - 2022-02-11T13:32:35+05:30 IST