Abn logo
Jul 31 2021 @ 10:19AM

మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండపల్లి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆనంద బాబును ఇంటి గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు - టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.