‘అంబులెన్స్‌లను అడ్డుకుంటుంటే జగన్ చోద్యం చూస్తున్నారా?’

ABN , First Publish Date - 2021-05-14T18:01:16+05:30 IST

కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడి ఏపీ కరోనా బాధితుల ప్రాణాలను తాకట్టు పెడుతున్నారని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘అంబులెన్స్‌లను అడ్డుకుంటుంటే జగన్ చోద్యం చూస్తున్నారా?’

అమరావతి: కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడి ఏపీ కరోనా బాధితుల ప్రాణాలను తాకట్టు పెడుతున్నారని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్‌లను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకొంటుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారా? అని మండిపడ్డారు. ఏపీ నుంచి రోగులను తీసుకువెళ్తున్న అంబులెన్సులను ఆపేయడంతో పెరుగుతున్న మృతులకు కారణం అయిన  తెలంగాణా పాలకులు, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని, రూ.5 వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకుని ప్రాణాపాయంలో ఉన్న రోగిచికిత్సకు  అనుమతివ్వకపోవడం దారుణం, కోర్టు ధిక్కారమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ ప్రభుత్వ ఆంక్షల వల్ల ఏపీ కరోనా బాధితుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు.  ఉమ్మడి రాజధాని, సొంత రాష్ట్ర హక్కులను కాపాడుకోలేని అచేతన స్థితిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నారు.  ప్రజల ప్రాణాల కన్నా సొంత ప్రయోజనాలు , రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యమయ్యాయా జగన్ మోహన్ రెడ్డి అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని కేసీఆర్‌తో చర్చలు జరపాలని... కేసీఆర్‌తో జగన్ ఏ ప్రయోజనాలు ఆశించి మౌనం వహిస్తున్నారో బహిరంగపరచాలని నాదెండ్ల బ్రహ్మం డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-14T18:01:16+05:30 IST