Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌కు లోకేష్ బహిరంగ లేఖ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన రూ.1309 కోట్ల నిధులను తిరిగి పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటల్లా తాకట్టుపెట్టడం,  ఈ మూడింటి మీదనే తమరు పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నిధుల మళ్లింపుపై దృష్టి పెట్టారన్నారు. పంచాయతీల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన 14, 15 ఆర్ధిక సంఘం నిధులను దారి దోపిడీ దారుల్లాగా తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. నాలుగు నెలల క్రితం 14వ ఆర్ధిక సంఘం నేతలు 344 కోట్లు విద్యుత్ బకాయిల కింద జమేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పి.ఎఫ్.సి , ఆర్.ఇ.సిల వద్ద రుణాలు తెచ్చేందుకు నిబంధనలు తుంగలో తొక్కారన్నారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై తమరు సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్దిని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలు మానుకోవాలని హితవుపలికారు. పల్లెల్లో దిగజారిన పరిస్థితులను చక్కదిద్దేందుకు మళ్లించిన నిధులు, ఎగవేసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement