Abn logo
May 15 2021 @ 14:55PM

నీరో చక్రవర్తికి మరో రూపంలా సీఎం జగన్: టీడీపీ నేత

నెల్లూరు: నీరో చక్రవర్తికి మరో రూపంలా సీఎం జగన్ వ్యవహారిస్తున్నారని టీడీపీ సిటీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఒక్కో జిల్లాని ఒక్కో మంత్రిని అప్పగిస్తే, వాళ్ళు కరోనా పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. నెల్లూరులో మెడికల్, పొలిటికల్ మాఫియా దోచుకుంటుందని ఆరోపించారు. కొన్ని హాస్పిటల్స్ లీజుకు తీసుకుని అనుమతులు లేకుండా హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారన్నారు. కలెక్టర్‌కు ధైర్యం ఉంటే మెడికల్ మాఫియా నిర్వహిస్తున్న 7 హాస్పిటల్స్‌లో తనిఖీలు చెయ్యాలని డిమాండ్ చేశారు. రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పొలుబోయిన అశ్విని కుమార్,  హాస్పిటల్స్ లీజుకు తీసుకుని కరోనా రోగుల నుంచి దోచుకుంటున్నారన్నారు. పొగతోటలో రాజకీయ రాబందులు ప్రజలని పిక్కు తింటున్నాయన్నారు. కరోనా రోగుల నుంచి రోజుకు రెండు కోట్ల మేర వసూళ్లు సాగుతున్నాయని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement