టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-08-10T11:22:00+05:30 IST

కాశినాయన మండల టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు కలసపాడు ఎస్‌ఐ

టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి అరెస్ట్‌

కాశినాయన ఆగస్టు 9: కాశినాయన మండల టీడీపీ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు కలసపాడు ఎస్‌ఐ గణమద్దిలేటి, బి.కోడూరు ఎస్‌ఐ వెంకటరమణల ఆధ్వర్యంలో దాదాపు 20 మంది పోలీసులు వెంకటరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇటీవల వివాదాస్పదంగా మారి నిలిచి పోయిన గ్రామ సచివాలయ నిర్మాణ పనులు గ్రామశివారులో తిరిగి ప్రారంభం కావడం, మరోవైపు టీడీపీ నాయకుడు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఒక దశలో ప్రజలకు అండగా ఉన్న టీడీపీ నేత వెంకటరెడ్డి అక్రమ అరె్‌స్టను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, పార్టీ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు సచివాలయం నిర్మించాలని కోరితే ఏకపక్షంగా నిర్మిస్తూ ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై ఎస్‌ఐ గణమద్దిలేటిని వివరణ కోరగా ఇటీవల వివాదాస్పదంగా మారిన సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ముందస్తుగా గ్రామంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వెంకటరెడ్డితో పాటు మరో ఆరుగురిని అరె్‌స్ట చేసి మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్‌ ముందు హాజరుపరిచి స్టేషన్‌ బెయిల్‌పై వారిని విడుదల చేశామని తెలిపారు. 

Updated Date - 2020-08-10T11:22:00+05:30 IST