Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ జేసీ పవన్

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై అనంతపురం పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ జేసీ పవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ...సొంత చెల్లెలికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వలేవు కానీ నీటి హక్కులపై కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇచ్చేసావు’’ అని వ్యాఖ్యానించారు.  సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడం లేదన్నారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. తగిన రీతిలో రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టాలని అన్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తు కోసం అందరూ సమష్టిగా పోరాటం చేయాలని జేసీ పవన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement