Advertisement
Advertisement
Abn logo
Advertisement

హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య: Gorantla

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటవిక పాలనలో ఉన్నామా?, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పరిటాల రవిని పట్టపగలు చంపారు, ఎవరు కారణమని నిలదీశారు. ‘‘తండ్రిని అడ్డుపెట్టుకుని తప్పించుకున్నావు కానీ హత్య, ఫ్యాక్షన్ రాజకీయాలు నీకు వెన్నతో పెట్టిన విద్య’’ సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఏపీ గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుందని తెలంగాణ పోలీసులే చెప్పారన్నారు. తెలంగాణ పోలీసులపై కేసులు పెట్టగలరా? ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని నాశనం చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement