Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రాజకీయం కాదు.. సేవ చేయాలి’

మద్దికెర, నవంబరు 28: పత్తికొండ నియోజకవర్గంలో ప్రతీది రాజకీయం చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని బురుజుల గ్రామంలో దెబ్బతిన్న ఉల్లి, పప్పుశనగ పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం సర్పంచ్‌ పద్మావతి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రెండున్నరేళ్లుగా పత్తికొండ నియోజకవర్గ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాము చేసిన పనులకు ప్రారంభోత్సవాలను చేసుకుంటున్నారన్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముందుచూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. తెగుళ్ల వల్ల ఉల్లి, పప్పుశనగ రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రైతులకు ఏమి చేయలేదన్నారు. మద్దికెర నుంచి పత్తికొండకు వచ్చే ఆ రోడ్డును కూడా వేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరిట డబ్బులు కట్టాలని చెబుతున్నారని, అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం మంచిది కాదన్నారు. రాష్ట్రం అప్పులకుప్పలుగా మారిపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని అన్నారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, మాజీ జడ్పీటీసీ జమేదార్‌ రాజన్నయాదవ్‌, మండల టీడీపీ అధ్యక్షుడు శివప్రసాద్‌, నాయకులు గడ్డం రామాంజనేయులు, బురుజుల మోహన్‌, బురుజుల పక్కీరప్ప, కేశవులు, నాగభూషణం, మాజీ ఎంపీటీసీలు గొర్రెల శివశంకర్‌, యడవలి ఆనంద్‌, నియోజకవర్గ రైతుసంఘం కార్యదర్శి పెసరబండ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు హుసేన్‌పీరా, విఠోభ, పెరవలి రాముయాదవ్‌, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement