అమరావతి: దివంగత టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ద్వితీయ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పల్నాటి ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన ఒక ధైర్యం డా.కోడెల శివప్రసాదరావు. అందుకే ప్రజలు ఆయనను పల్నాటి పులి అని పిలిచారు. కోడెల శివప్రసాదరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయ ప్రజానేత స్మృతికి నివాళులు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.