అమరావతి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘గత ఏడాది మిగిల్చిన చీకట్లు, ఇక్కట్లు తొలగిపోయి ప్రతి తెలుగు లోగిలికి సంతోష ఐశ్వర్యాలతో కూడిన క్రాంతి సంక్రమించాలని కోరుకుంటూ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.