Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ: Ayyanna

twitter-iconwatsapp-iconfb-icon
జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ: Ayyanna

విశాఖపట్నం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చామని, దాదాపు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. స్నేహితుడి పరామర్శకు వెళ్లిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేపై కేసులు పెట్టారన్నారు. జగన్‌రెడ్డి జేబు సంస్థగా సీఐడీ మారిందని విమర్శించారు. జగన్‌రెడ్డిని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టేందుకే సీఐడీ పనిచేస్తోందన్నారు. సీఐడీ ఎజెండాను వైసీపీ పెద్దలు సెట్‌ చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సీఐడీని దిగజార్చిన ఘనత జగన్‌రెడ్డికే దక్కుతుందని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.