అరాచకం అనేది వైసీపీ డీఎన్‌ఏలోనే ఉంది: ఆలపాటి

ABN , First Publish Date - 2021-06-15T16:49:53+05:30 IST

అరాచకం అనేది వైసీపీ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు.

అరాచకం అనేది వైసీపీ డీఎన్‌ఏలోనే ఉంది: ఆలపాటి

అమరావతి: అరాచకం అనేది వైసీపీ డీఎన్ఏలోనే ఉందని టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా? ప్రశ్నించారు. అధికార అహంతో వైసీపీ నాయకులు విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతిలోని ఉంగుటూరు గ్రామ సర్పంచ్ భర్త సోమశేఖర్‌పై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడికి పాల్పడిన రాయపాటి శివపై రౌడీ షీట్ ఓపెన్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత, మహిళ హోం మంత్రిని ఉత్సవ విగ్రహంలా మార్చేశారని,  ఆమె సొంత జిల్లాల్లోనే ఇలాంటి దాడులు జరుగుతున్నా పట్టించుకోకపోవడం హేయమని ఆలపాటి విమర్శించారు.


Updated Date - 2021-06-15T16:49:53+05:30 IST