Advertisement
Advertisement
Abn logo
Advertisement

పవన్ డిమాండ్‌పై అచ్చెన్న స్పందన

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్‌‌పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. పవన్ డిమాండ్‌ను స్వాగతిస్తున్నామని తెలిపారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లమని ముందు నుంచి టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ఉద్యమం ఆరంభంలోనే దీక్షా శిబిరాన్నిచంద్రబాబు సందర్శించారని తెలిపారు. అసెంబ్లీలో చేసిన తీర్మానంపై తమకు నమ్మకం లేదని...ఢీల్లీకి పంపించి ఉంటే.. రిప్లై రావాలి కదా...అటువంటిది వచ్చినట్టు తమకు తెలియదని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో బల్ల గుద్ది మాట్లాడారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చి అక్కడ ఒక మాట ఇక్కడ ఒకమాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.


వారం రోజుల్లో అఖిలపక్షం వేయాలన్న పవన్ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే చాలా సంతోషమని... తాము ఏమి అడిగినా రివర్స్‌లో చేయడం ప్రభుత్వానికి అలవాటని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసిన తర్వాత బైటకు వచ్చి వివరాలు మీడియాకు చెప్తారని...కానీ సీఎం జగన్ అలా చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని ముందు నుంచీ చెబుతున్నామని..ఇప్పటికి గవర్నర్‌లో చలనం వచ్చిందని తెలిపారు. వైసీపీకి టీడీపీ బెస్ట్ ఫ్రెండ్ అవునో కాదో  ప్రజలకు తెలుసన్నారు. స్నేహితులమే అయితే జాతీయ పార్టీ కార్యాలయంపై దాడులు, కేసులు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. పవన్ ఇచ్చిన వారం రోజుల డెడ్‌లైన్‌కు  ఎలాంటి స్పందన వస్తుందో చూద్దామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement