మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పిలుపు
గోరంట్లలో టీడీపీ బాదుడే బాదుడు
గోరంట్ల, మే 18: సీఎం జగన్మోహనరెడ్డి అసమర్థ పాలనను అంతమొందించాలని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. ప్రజలకు పిలుపునిచ్చారు. గోరంట్లలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నిమ్మల నివాసం వద్ద నుంచి ప్రధాన రహదారిపై బస్టాండు కూడలి వరకు కొవ్వొత్తులు వెలిగించి, నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకుని, ధరల పెరుగుదలను నిరసిస్తూ నినాదాలు చేశారు. బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. నిమ్మల మాట్లాడుతూ సీఎ జగనకు పాలన చేతకాక అన్నింటి ధరలు పెంచేసి, సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. చంద్రబాబు సోమందేపల్లి సభకు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, సోమందేపల్లి మాజీ జడ్పీటీసీ వెంకటరమణ, నాయకులు నిమ్మల చంద్రశేఖర్, పులేరు సుబ్రహ్మణ్యం, నరే్‌షకుమార్, కక్కల రఘునాథ్‌రెడ్డి, వృషభదేవుడు, శ్రీనివాసులు, నరసింహులు, రుద్ర, జిలానీ, ఆంజనేయులు, నాగరాజు, చంద్రశేఖర్, భరతకుమార్, రహంతుల్లా, నూర్‌మహ్మద్ పాల్గొన్నారు.