దాడులలో మృతులకు నివాళులర్పిస్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు
గాజువాక, మే 17: రాష్ట్రంలో వైసీపీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ గాజువాక అధ్యక్షురాలు సిగటపు సుజాత అన్నారు. గాజువాక తెలుగు మహిళ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా వైసీపీ పాలనలో అసువులు బాసిన ఆడపిల్లలకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ వైసీపీ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మధులత, ఉమ, రాంబాయి. జయలత, కాకి స్వరూపరాణి, భాగ్యలక్ష్మి, గాజువాక పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ పాల్గొన్నారు.