Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మనుగడ కోసం టీడీపీ కుట్రలు’


పాయకరావుపేట, అక్టోబరు 22 : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం  జగన్మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచారని, అది ఓర్వలేక మనుగడ కోసం టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఆరోపించారు. వైసీపీ నాయకులు రెండోరోజుల పాటు ఇక్కడ చేపట్టిన జనాగ్రహ దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసిన సందర్భంగా పట్టణంలో ఆ పార్టీ శ్రేణులు నిర్వ హించిన ర్యాలీలో మాట్లాడారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న చంద్రబాబునాయుడు మనసు మారా లని కోరుకుంటూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఉంచారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు లంక సూరిబాబు, వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబూరావు, వీసం రామకృష్ణ, గూటూ రు శ్రీనివాసరావు, ఇసరపు తాతారావు, గారా ప్రసాద్‌, జగతా శ్రీను, ధనిశెట్టి బుజ్జి, కాదా రామకృష్ణ, చోడిపల్లి శ్రీను లతో పాటు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement