పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలి

ABN , First Publish Date - 2022-07-06T05:49:52+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన బస్సు చార్జీలు తగ్గించాలి
బుట్టాయగూడెంలో టీడీపీ నాయకుల నిరసన

బుట్టాయగూడెం, జూలై 5 : ఆర్టీసీ బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళవారం బుట్టాయగూడెంలో ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు చార్జీలను పెంచడం వల్ల ప్రభుత్వం రూ.2175 కోట్ల మేర ప్రజల జేబులకు చిల్లు పెట్టిందని, పేద ప్రజలపై భారం మోపిందని విమర్శించాఉ. గతంలో రూ. 650 కోట్లు, రెండోసారి రూ. 1500 కోట్లను భారం మోపిందన్నారు. జగన్‌ అసమర్థ పాలనకు చమరగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నాయకులు మొగ పర్తి సోంబాబు, గద్దె అబ్బులు, మానెల్లి బాలు, మడకం కన్నపరాజు, మడకం రామకృష్ణ, నిమ్మగడ్డ రాంబాబు, నందిన నాగబాబు, కాకర్ల జగదీష్‌, బిర్రా నాగభూషణం, ఎం.మోజెష్‌, కేరం వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

జనసేన ఆధ్వర్యంలో..

ఏలూరు కార్పొరేషన్‌, జూలై 5 : ఇప్పటికే గతంలో రెండుసార్లు పెంచిన ఆర్టీసీ చార్జీలను మళ్లీ మూడోసారి పెంచడం అన్యాయమని, పెంచిన చార్జీలను తగ్గించాలని కోరుతూ జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడమ తిప్పం.. మాట తప్పం అన్న మాటలు ఏమయ్యాయంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. జనసేన నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీనరేష్‌, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్‌, జిల్లా కార్యదర్శి కస్తూరి తేజశ్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్‌, మెగా ఫ్యాన్స్‌ అధ్యక్షుడు దోసపర్తి రాజు, ఉపాధ్యక్షుడు బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయిచరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-06T05:49:52+05:30 IST