Abn logo
Mar 1 2021 @ 23:50PM

చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేకే నిర్బంధం

నెల్లూరులో టీడీపీ నేతల ఆందోళన

నెల్లూరు(వ్యవసాయం), మార్చి 1 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తిరుపతిలో పర్యటిస్తే వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తాయని అక్రమంగా నిర్బంధించారని టీడీపీ నేత ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌ ఎద్దేవా చేశారు. తిరుపతి విమానశ్రయంలో చంద్రబాబు నాయుడి అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ సోమవారం గాంధీబొమ్మ సెంటర్‌లో నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రసాద్‌ మాట్లాడుతూ చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక నిర్బంధించారన్నారు. వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవని, త్వరలోనే భంగపాటు తప్పదని హెచ్చరించారు. పిట్టి సత్యనాగేశ్వరరావు, కప్పిర శ్రీనివాసులు, పడవల కృష్ణమూర్తి మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంలో తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమలో నాయకులు శైలజ, జహీర్‌, మల్లికార్జున్‌, శశి, మస్తాన్‌, పెంచలయ్య, రాజా, ప్రసాద్‌, మురళి, నాగేంద్ర, రేవతి తదితరులు పాల్గొన్నారు. కాగా, చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేయటం దారుణమని నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎద్దల రవి ఓ ప్రకటనలో విమర్శించారు. 


నరసింహ యాదవ్‌కు అజీజ్‌, కోటంరెడ్డి పరామర్శ

టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌తోపాటు పలువురు నేతలను ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిసేందుకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళుతున్న  నరసింహ యాదవ్‌, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి పోలీసు స్టేషన్‌లో ఉన్న వారిని అజీజ్‌, కోటంరెడ్డి పరామర్శించారు. వారిని భేషరతుగా విడుదల చేయాలని పోలీసులను కోరారు. కాగా, చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడాన్ని ఖండిస్తూ విమానాశ్రయానికి చేరుకున్న అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట, వాగ్వాదం జరిగాయి.

Advertisement
Advertisement
Advertisement