అధికార పార్టీ అక్రమాలపై టీడీపీ నేతల ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-17T05:22:05+05:30 IST

తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేతలు శుక్రవారం ఎన్నికల పరిశీలకుడు దినే్‌షకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ అక్రమాలపై   టీడీపీ నేతల ఫిర్యాదు
ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు

ఎన్నికల పరిశీలకుడు దినే్‌షను కలిసిన నేతలు


నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 16 : తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ నేతలు శుక్రవారం ఎన్నికల పరిశీలకుడు దినే్‌షకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పనబాక కృష్ణయ్య తదితరులు ఎన్నికల పరిశీలకులను కలిశారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోందని విమర్శించారు. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ వలంటీర్ల చేత ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయిస్తోందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ నేత జలదంకి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


వలంటీర్ల రాజకీయంపై  ఆగ్రహం


ఉప ఎన్నికలలో అధికార పార్టీ వలంటీర్లతో రాజకీయం  చేస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక్కో వలంటీరుకు రూ.5వేలు ఇచ్చి వారి చేతుల మీదుగా రాజకీయం  చేయిస్తోందని మండిపడ్డారు.  ఎన్నికల సంఘం దీన్ని తీవ్రమైన పరిణామంగా భావించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-04-17T05:22:05+05:30 IST