ఐటీ శాఖ వెల్లడి
చెన్నై/ప్యారీస్: నగరంలో ఉన్న శరవణ స్టోర్స్ యాజమాన్యం రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసం చేసిందని చెన్నై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. స్థానిక టి.నగర్‌లో సూపర్ శరవణ స్టోర్స్, శరవణ సెల్వరత్నం పేర్లతో వస్త్ర దుకాణాలున్నాయి. ఈ సంస్థలకు నగర శివారు ప్రాంతాల్లో కూడా శాఖలున్నాయి. వస్త్రాలు మాత్రమే కాకుండా ఆభరణాలు, గృహోపకరణాలు విక్రయిస్తున్నారు. మొత్తం 37 ప్రాంతాల్లోని శరవణ స్టోర్స్‌ల్లో ఇటీవల ఐదు రోజులు ఐటీ అధికారులు ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న దస్తావేజులు పరిశీలించగా సుమారు రూ.1,000 కోట్లకు పైగా పన్ను చెల్లించకుండా మోసానికి పాల్పడినట్టు తెలిసిందని ఐటీ అధికారులు తెలిపారు.