తరుణ్ గొగోయ్ నాకు గురువు... ఆయన మృతి వ్యక్తిగతంగా లోటు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-11-25T20:05:29+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ భౌతికకాయానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు.

తరుణ్ గొగోయ్ నాకు గురువు... ఆయన మృతి వ్యక్తిగతంగా లోటు : రాహుల్ గాంధీ

అసోం : మాజీ ముఖ్యమంత్రి  తరుణ్ గొగోయ్ భౌతికకాయానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘తరుణ్ గొగోయ్ నాకు టీచర్. నాకు గురువు. ఆయన మృతి నాకు వ్యక్తిగతంగా లోటు. ఆయనతో చాలా గంటల పాటు గడిపే అవకాశం నాకు వచ్చింది. అసోం గురించి ఎవరూ చెప్పలేనంత అందంగా నాకు వివరించారు. అసోం ప్రజల సంస్కృతి గురించి కూడా అంతే అందంగా వివరించారు. నన్ను ఓ కుమారుడిగా భావించేవారు.’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అసోం రాష్ట్రానికి ఆయన ఎనలేనిసేవ చేశారని, దేశానికి కూడా తమ సేవలనందించారని రాహుల్ గాంధీ కొనియాడారు. 

Updated Date - 2020-11-25T20:05:29+05:30 IST