కేంద్రం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోంది: తమ్మినేని

ABN , First Publish Date - 2022-04-03T19:37:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని తమ్మినేని విమర్శించారు.

కేంద్రం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోంది: తమ్మినేని

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధర గతంలో 140 డాలర్లు ఉన్నా.. ఈ ధరలు లేవన్నారు. ప్రతి రూపాయిలో 45 పైసలకు పైగా డబ్బు పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తోందన్నారు. పన్నుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే.. మనమూ పెంచాల్సిన అవసరం లేదన్నారు. పెంచిన ధరలు తగ్గే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. 


బస్సు, విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీలో టోల్ సెస్సు వసూలు చేస్తున్నారని, ఇక్కడ టోల్ ఎక్కడిది? అని ప్రశ్నించారు. చార్జీలను తగ్గించకపోతే కేసీఆర్‌కు పతనం తప్పదన్నారు. వరిధాన్యం కొనుగోలు బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పూర్తిగా సమర్థిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని తమ్మినేని వీరభద్రం పిలుపిచ్చారు.

Updated Date - 2022-04-03T19:37:35+05:30 IST