Abn logo
Oct 23 2021 @ 08:26AM

ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొత్త వెబ్‌సైట్లు, తమిళ సాఫ్ట్‌వేర్లు

                       - ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై(Tamilnadu): రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేసే పథకాల వివరాలను తెలియజేసేందుకు కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను, సమాచార సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకు నేలా ‘తగవల్‌ తొళిల్‌నుట్ప నన్‌బన్‌’ (ఐటీ ఫ్రెండ్‌) పేరిట మరో వెబ్‌సైట్‌ను, తమిళ లిపికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్లను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. చెన్నై సచివాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ‘ఈ- మున్నేట్రమ్‌’ పేరుతో ఆయన కొత్త వెబ్‌సైట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా అందజేయ డానికే రాష్ట్ర ఐటీ శాఖ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించిందని పేర్కొన్నారు. ఇదే విధంగా తమిళ్‌-99 కీబోర్డు, ఫొనెటిక్‌ కీబోర్డు, ఓల్ట్‌ టైప్‌రైటర్‌ కీబోర్డు ఒకే సాఫ్ట్‌వేర్‌లో లభించేలా ‘కీళడి- కీబోర్డు తమిళ్‌ యూనికోడ్‌ కన్వర్టెర్‌’ పేరుతో రూపొందించిన కొత్త సాఫ్ట్‌వేర్లను  కూడా స్టాలిన్‌ ఆవిష్కరించారు. ఈ సాఫ్ట్‌వేర్లను www.tamilvu.org/unicode అనే వెబ్‌సైట్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డి.మనోతంగరాజ్‌, ప్రభుత్వ ప్రణాళిక, అభివృద్ధి శాఖల అదనపు ప్రధాన కార్యదర్శి విక్రమ్‌ కపూర్‌, రాష్ట్ర ఇ-గవర్నన్స్‌ సలహాదారు పీడబ్ల్యూసీ డేవిదార్‌, సమాచార సాంకేతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరజ్‌ మిట్టల్‌, ఈ-గవర్నెన్స్‌ డైరెక్టర్‌ కే విజయేంద్ర పాండ్యన్‌, తమిళ లిపికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను తయారు చేసిన ఇండిక్‌ హెరిటేజ్‌లాబ్స్‌ సంస్థ సీఈఓ నాగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption