తాలిపేరుకు వరద పోటు

ABN , First Publish Date - 2022-09-23T04:47:53+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌, చర్ల మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

తాలిపేరుకు వరద పోటు
తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల దృశ్యం

12 గేట్లు ఎత్తివేత

24, 348 వేల క్యూసెక్కుల నీరు విడుదల

చర్ల, సెప్టెంబరు 22: ఛత్తీస్‌గఢ్‌, చర్ల మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు గురువారం ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 24,348 వేల క్యూసెక్కులనీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 73.45 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 23, 036 వేల క్యూసెక్కులు కాగా అవుట్‌ ఫ్లో 24,348 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని రేపు కూడా ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-09-23T04:47:53+05:30 IST