అమెరికా, బ్రిటన్‌లకు తాలిబన్ల వార్నింగ్..!

ABN , First Publish Date - 2021-08-23T20:51:34+05:30 IST

సైన్యాల ఉపసంహరణ కోసం అదనపు సమయం కోరితే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా, బ్రిటన్‌ను తాలిబన్లు తాజాగా హెచ్చరించారు.

అమెరికా, బ్రిటన్‌లకు తాలిబన్ల వార్నింగ్..!

కాబూల్:  సైన్యాల ఉపసంహరణ కోసం అదనపు సమయం కోరితే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా, బ్రిటన్‌ను తాలిబన్లు తాజాగా హెచ్చరించారు. ఆగస్టు 31 డెడ్‌లైన్ పొడిగించే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. "ఆగస్టు 31 నాటికి సైన్యాల ఉపసంహరణ పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఈ గడువును అమెరికాగానీ, బ్రిటన్ గానీ పొడిగించదలిస్తే... అవసరం లేకున్నా వారు అఫ్ఘానిస్థాన్‌లో మరికొంత కాలం ఉండేందుకు నిర్ణయించినట్టు భావించాల్సి ఉంటుంది. వారు తమ నిర్ణయాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.’’ అని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహెల్ షాహీన్ తాజాగా హెచ్చరించారు. ఆగస్టు చివరికల్లా కల్లా పూర్తిస్థాయిలో తమ బలగాలను వెనక్కు పిలిపించుకుంటామని అమెరికా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. సైన్యాల ఉపసంహరణకు మరికొంత సమయం పట్టొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో తాలిబన్ల హెచ్చరికకు ప్రాధాన్యం పెరిగింది. 

Updated Date - 2021-08-23T20:51:34+05:30 IST