నెల్లిమర్ల: చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కుస్తీ పోటీల్లో మండలంలోని రామతీర్థం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బహుమతులు సాధించినట్టు హెచ్‌ఎం ఎస్.ఆర్.ఎల్.శాస్ర్తి చెప్పారు. పాఠశాలకు చెందిన సీహెచ్ ధరిణికి వెండి పతకం, సీహెచ్ జాహ్నవికి కాంస్యపతకం లభించాయని తెలిపారు. అలాగే కర్నూలులో జరిగిన అండర్ 15 విభాగం కుస్తీ పోటీల్లో ధరణి, జాహ్నవిలకు రజత పతకాలు వచ్చాయని తెలిపారు. విజేతలుగా నిలిచిన బాలికలను హెచ్‌ఎంతో పాటు వ్యాయామ ఉపాధ్యాయిని సీహెచ్ సోమేశ్వరి అభినందించారు.