తక్కెళ్లపాడులో.. తొలి నామినేషన్‌

ABN , First Publish Date - 2021-01-26T14:17:00+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఎన్నికల ఘట్టం ప్రారంభం కాగా..

తక్కెళ్లపాడులో.. తొలి నామినేషన్‌

అభ్యర్థులకు రశీదు ఇవ్వని రిటర్నింగ్‌ అధికారి

పంచాయతీ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన

కోయవారిపాలెం, కొండేపాడుల్లోనూ నామినేషన్లకు సిద్ధమైన అభ్యర్థులు


పెదకాకాని, ప్రత్తిపాడు(గుంటూరు): రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఎన్నికల ఘట్టం ప్రారంభం కాగా జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో తొలి నామినేషన్‌ దాఖలైంది. శుక్రవారం ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గుంటూరు డివిజన్‌లో సోమవారం నామినేషన్ల ప్రక్రియను ఉదయాన్నే ప్రారంభించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు పంచాయతీలో అధి కారులు అభ్యర్థులకు నామినేషన్‌ పత్రాలు ఇచ్చా రు. ప్రత్తిపాడు మండలంలో  కోయవారిపాలెం, కొండేపాడు పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకు వచ్చినా వారికి ఆయా పత్రాలు ఇచ్చేందుకు ఇక్కడి అధికారులు తొలుత నిరాకరించారు.  ఎస్‌ఈసీ సూచనల ప్రకారం ఆయా పంచా యతీల్లో నామినేషన్ల స్వీకరణకు స్టేజ్‌ 1 అధికారులు విధులకు హాజరయ్యారు. ఒక పక్క కోర్టు ఉత్తర్వులు ఏమిస్తుందో అనే ఉత్కంఠ ఉన్నప్పటికీ అధికారులు ఎన్ని కల కమిషన్‌ ఆదేశాల ప్రకారం విధుల్లో ఉన్నారు. అయి తే నామినేషన్‌ పత్రాలు ఇవ్వడానికి మాత్రం పలు చోట్ల అధికారులు నిరాకరించారు. సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు నామినేషన్‌ పత్రాలు ఇవ్వమని తెలిపారు.  కోర్టు ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అంతలోనే గుంటూరు డివిజన్‌కు సంబంధించి షెడ్యూల్‌ మారింది. అంతకముందు తక్కెళ్లపాడు పంచాయతీ పరిధిలోని రెండు వార్డుల్లో పోటీ చేసేందుకు ఇద్దరు అభ్యర్థులు ముందుకు వచ్చారు. 8వ వార్డుకు కాటమనేని విజయ్‌, 7వ వార్డుకు భైరపనేని లక్ష్మీనారాయణ నామినేషన్‌ పత్రాలతో పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు.


వీరు రూ.1000 చెల్లించేందుకు సిద్ధమైనా రిటర్నింగ్‌ అధి కారి ప్రసన్న నగదు తీసుకుని రశీదు ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి ఎంపీడీవో హనుమారెడ్డి రిటర్నింగ్‌ అధికారిని తన కార్యాలయానికి పిలిపించుకుని జాప్యం చేశారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఇద్దరూ తక్కెళ్లపాడు లోని పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేప ట్టారు. తమ నామినేషన్లను తిరస్కరిస్తే ఉపేక్షించేది లేద ని తేల్చి చెప్పారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయని ఇపుడు నామినేషన్లు స్వీకరించమని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రసన్న తెలిపారు.  ప్రత్తిపాడు మండలంలోని  కోయవారిపాలెం స్టేజ్‌ 1 అధికారి కృష్ణారెడ్డి నామినేషన్‌ పత్రాలు ఇవ్వడానికి తొలుత నిరాకరించారు. కొండేపాడు  గ్రామ నాయకులు నామినేషన్‌ పత్రాలను ఇవ్వాలని కోరగా కోర్టు నుంచి తీర్పు వచ్చే వరకు ఇవ్వమని అక్కడి అధికారులు తెలిపారు.  


గ్రామాల్లో పటిష్ట బందోబస్తు.. రూరల్‌ ఎస్పీ ఆదేశాలు

గుంటూరు: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఆదేశించారు.  సోమవారం ఆయ న తెనాలి, బాపట్ల సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారుల తో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిస్పక్షపాతంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2021-01-26T14:17:00+05:30 IST