కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-09T05:43:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గాట్టుబాటు ధరలు అందించే నిమిత్తం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేష్‌ రెడ్డి అన్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కమ్మర్‌పల్లి, ఏప్రిల్‌ 8: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గాట్టుబాటు ధరలు అందించే నిమిత్తం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేష్‌ రెడ్డి అన్నారు. మండలంలోని చౌట్‌పల్లి సహకారం సం ఘంలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ లోలపు గౌతమి, సొసైటీ చైర్మన్‌ కుంట ప్రతాప్‌రెడ్డి తో కలిసి  ప్రాం భించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకే కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు మేలురకం ధా న్యాన్ని తెచ్చి మద్దతుధరలు పొందాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్‌, వైస్‌ చైర్మన్‌ గడ్డం శ్రీధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌ నాయక్‌, సర్పంచ్‌ మారుశంకర్‌, ఎంపీటీసీ ఎశాల నర్సయ్య, రైసస మండల కోఆర్డినేటర్‌ బద్దం రాజేశ్వర్‌, సొసైటీ డైరెక్టర్‌లు, కార్యదర్శి రాజు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-09T05:43:06+05:30 IST