బెంగాల్‌లో హింసను ఆరికట్టండి: అధీర్ రంజన్

ABN , First Publish Date - 2021-02-27T17:59:13+05:30 IST

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు..

బెంగాల్‌లో హింసను ఆరికట్టండి: అధీర్ రంజన్

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విజ్ఞప్తి చేశారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఎనిమిది దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై ఈసీ కఠినంగా వ్యవహరించాలని అన్నారు. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు.


పశ్చిమబెంగాల్‌లో మే 30వ తేదీతో 16వ అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. దీంతో 17వ అసెంబ్లీకి 8 విడతలుగా ఎన్నికలు జరపనున్నట్టు ఈసీ ప్రకటించింది. తొలివిడత పోలింగ్ మార్చి 27, రెండో విడత ఏప్రిల్ 1, మూడో విడత ఏప్రిల్ 6, నాలుగో విడత ఏప్రిల్ 10, ఐదో విడత ఏప్రిల్ 17, ఆరో విడత ఏప్రిల్ 22, ఏడో విడత ఏప్రిల్ 26, ఎనిమిదో విడత ఏప్రిల్ 29న జరుగుతుంది. పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.

Updated Date - 2021-02-27T17:59:13+05:30 IST