Advertisement
Advertisement
Abn logo
Advertisement

తాజ్ మహల్‌ను ఫ్రీగా చూస్తారా... ఇదే సదవకాశం!

ఆగ్రా: ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా యూపీలోని తాజ్ మహల్ ను సందర్శించాలనుకునేవారికి ఇదొక సువర్ణావకాశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మహిళలకు ప్రత్యేక కానుక అందిస్తున్నట్లు ప్రకటించింది. 

మార్చి 8న మహిళలు తాజ్‌మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీతో పాటు అన్ని పురాతన కట్టడాలను ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా సందర్శించవచ్చు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత ఏడాది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి అవకాశాన్ని కల్పించింది. ఈసారి కూడా ఇటువంటి అవకాశాన్ని మహిళలకు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement