టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-04-16T15:15:07+05:30 IST

నిరుద్యోగ యువత, మహిళలకు..

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

గుంటూరు: నిరుద్యోగ యువత, మహిళలకు టైలరింగ్‌లో యూనియన్‌ బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ జీఎస్‌ఆర్‌ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులు తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో కొత్తపేటలోని యూనియన్‌ బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థలో సంప్రదించాలన్నారు. వివరాల కోసం 0863-2336912లో సంప్రదించాలని సూచించారు.

Updated Date - 2021-04-16T15:15:07+05:30 IST