‘గూడెం’లో జ్వరాలు

ABN , First Publish Date - 2022-08-17T05:26:30+05:30 IST

తాడేపల్లిగూడెం పట్టణంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి.

‘గూడెం’లో జ్వరాలు

 ప్రతి ఇంట్లో ఓ జ్వరపీడితుడు  
 మలేరియా.. డెంగ్యూ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిక
 రూ. లక్షల్లో పిండుతున్న ఆసుపత్రి యాజమాన్యాలు
  పైపులైన్ల లీకేజీలు .. పారిశుధ్య నిర్వహణే ప్రధాన లోపం


తాడేపల్లిగూడెం క్రైం, ఆగస్టు16: తాడేపల్లిగూడెం పట్టణంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం పారిశుధ్య లేమి.. పైపులైన్ల లీకేజీయే. అధికారులు నెలనెలా వీధుల్లో బ్లీచింగ్‌ చల్లించటం లేదని, తాగునీటిలో క్లోరినేషన్‌ చేయ టంలో అలసత్వం వహిస్తున్నారని పట్టణ వాసులు వాపోతున్నారు. వైరల్‌ ఫీవర్‌, డెంగ్యూ, మలేరియా వ్యాఽధులతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడ చూసినా మురుగే ..


పట్టణంలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఏ ప్రాంతంలో చూసినా మురుగు దర్శనమిస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు బాధలు వర్ణనా తీతం. దీనికి తోడు డ్రైనేజీ వాటర్‌ రోడ్లపైకి వస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఇంకోపక్క పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని వీకర్స్‌ కాలనీ, కడకట్ల, యాగర్లపల్లి, మార్కెట్‌ ఏరియా, మామిడితోట, సీతారాంపేటలో పారిశుధ్య సమస్య జఠిలంగా ఉంది.  ఇకనైనా అధికారులు స్పందించాల్సి ఉంది.

ఆస్తులు అమ్ముకోవాల్సిందే..


వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వెళ్దామని ప్రజలు ఆలోచిస్తేనే భయపడిపోతున్నారు. చివరికి ఆరోగ్యం కంటే ఇంకేమీ ముఖ్యం కాదని ధైౖర్యం తెచ్చుకొని వెళ్తున్నారు. చివరకు తన సొంత ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రోగులు ఫుల్‌ .. వైద్యం నిల్‌


రోజురోజుకీ పట్టణమంతా జ్వరపీడితులు ఎక్కు వవుతుండటంతో ఏరియా ఆసుపత్రిలోని వార్డు లన్నీ నిండిపోయాయి. వైద్యులు లేరనే కారణంతో చిన్నపాటి మందు బిల్లలు ఇచ్చి వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైపులైన్ల మార్పు లేకే..


పట్టణంలో పైపులైన్లు వేసి దాదాపు 50 ఏళ్లు కావస్తోంది. వీటిని మళ్లీ వేసేందుకు అమృత్‌ పథకంలో నిధులు మంజూరైనా... నేటికీ కార్య రూపం దాల్చలేదు. దీంతో పలుచోట్ల లీకేజీలు ఏర్పడుతున్నాయి. వాటిలో కొన్నింటికి మున్సి ప ల్‌ అధికారులు మరమ్మతులు చేసి వదిలేశారు.

Updated Date - 2022-08-17T05:26:30+05:30 IST