ఆన్‌లైన్‌ చదువుల మోత..!

ABN , First Publish Date - 2020-07-07T11:01:46+05:30 IST

అసలే లాక్‌డౌన్‌ కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది.

ఆన్‌లైన్‌ చదువుల మోత..!

తల్లిదండ్రులపై భారం.. స్మార్ట్‌ ఫోన్‌, 

ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లకు వేలల్లో ఖర్చు

డేటా చార్జీలు అదనం.. పలు విద్యాసంస్థల్లో మొదలైన ఆన్‌లైన్‌ తరగతులు 


ఏలూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): అసలే లాక్‌డౌన్‌ కష్టాల్లో ఉన్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుండటంతో వారిపై మరింత భారం పెరు గుతోంది. వీటి కోసం సెల్‌ ఫోన్‌లు, ట్యాబ్‌లు, నోట్‌ బుక్‌లు, ల్యాప్‌టాప్‌లు కొనాల్సి వస్తోంది. వీటిల్లో ఏది కొనాలన్నా కనీ సం రూ.10 వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇద్దరు పిల్లలున్న తల్లి దండ్రులకు ఇది రెట్టింపవుతోంది. ఆన్‌లైన్‌లో క్లాసులు వినా లంటే డేటా రీచార్జ్‌ భారం తప్పదు. ప్రతీ నెల డేటా నిమిత్తం రూ.500లకు పైగానే ఖర్చు చేయాలి. జిల్లాలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు సుమారు 80 వేల మందితోపాటు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు రెండు లక్షల  పైమాటే. వీరిలో చాలా మందికి ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌ లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాయి.


ఇప్పుడు వీరంతా ఫోన్‌లు, ట్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సిందే. వీరిలో 25 శాతం మందికి ఫోన్‌లు, ట్యాబ్‌లు కొన్నా దాదాపు రూ.70 కోట్లు వెచ్చించాల్సిందే. వీటికితోడు ఇంటర్నెట్‌, మొబైల్‌ డేటా అద నం. ఓ వైపున రాష్ట్ర విద్యాశాఖ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించ వద్దని చెబుతున్నా.. పలుచోట్ల తరగతులు నడుస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులకు రెగ్యులర్‌ ఫీజులు చెల్లించాలని పలు విద్యాసంస్థలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికీ రోజుకు మూడు నుంచి ఐదు గంటలు ఆన్‌లైన్‌ క్లాసులు జరు గుతున్నాయి.  ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తు న్నారు.


హోం వర్క్‌లతోపాటు ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్న దీ లేనిదీ పరిశీలించే బాధ్యత తల్లితండ్రులపై పడింది. ఆగస్టు మూడో తేదీ నుంచి పాఠశాలలు తెరవనున్నట్టు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. కరోనా కేసుల పెరుగుదల వేలల్లో చేరుకో వడంతో అప్పటికి తెరుస్తారా ? లేదా ? అన్నది అనుమానమే. ఈ నేపఽథ్యంలో ఈ ఏడాది సరిపడా ఆన్‌లైన్‌ క్లాసుల ప్రణా ళికలతో ప్రైవేటు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

Updated Date - 2020-07-07T11:01:46+05:30 IST