ఆసుపత్రిలో నర్సులను వేధించిన జమాత్ కార్యకర్తలపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-04-03T11:43:28+05:30 IST

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి హాజై కరోనా వైరస్ లక్షణాలతో ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు ...

ఆసుపత్రిలో నర్సులను వేధించిన జమాత్ కార్యకర్తలపై పోలీసు కేసు

రోగులు అర్ధ నగ్నంగా తిరుగుతూ సిగరెట్లు కావాలని వేధించారు

ఘజియాబాద్ : ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి హాజై కరోనా వైరస్ లక్షణాలతో ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు అర్ద నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఆరుగురు జమాత్ సభ్యులైన రోగులు అర్దనగ్నంగా తిరుగుతూ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని డాక్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరుగురు రోగులు సిగరెట్లు, బీడీలు కావాలని డాక్టర్లు, నర్సులను డిమాండ్ చేస్తున్నారని చీఫ్ మెడికల్ ఆఫీసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు కరోనా రోగులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఎంఎంజీ ఆసుపత్రి నర్సులు ఫిర్యాదు చేశారని చీఫ్ మెడికల్ ఆఫీసరు చెప్పారని ఘజియాబాద్ నగర ఎస్పీ చెప్పారు. ఈ ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేస్తున్నామని నగర ఎస్పీ పేర్కొన్నారు. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2020-04-03T11:43:28+05:30 IST