నీళ్లల్లో ఎక్కువ సేపు ఉంటే.. చర్మం ఇలా ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా..?

ABN , First Publish Date - 2021-12-23T22:02:30+05:30 IST

మనం ఎక్కువ సేపు నీళ్లలో ఉన్నప్పుడు చేతులు, అరకాళ్లు, చర్మం ముడతలు పడుతుంటాయి. ఇలా ఎందుకు ముడతలు పడుతుంటాయి. దీనికేమైనా కారణం ఉందా?

నీళ్లల్లో ఎక్కువ సేపు ఉంటే.. చర్మం ఇలా ఎందుకు ముడతలు పడుతుందో తెలుసా..?

మనం ఎక్కువ సేపు నీళ్లలో ఉన్నప్పుడు చేతులు, అరకాళ్లు, చర్మం ముడతలు పడుతుంటాయి. ఇలా ఎందుకు ముడతలు పడుతుంటాయి. దీనికేమైనా కారణం ఉందా? ఎక్కువ సేపు నీటిలో నానడం వల్ల ఇలా ఏర్పడతాయా? లేక శరీరంలో కలిగే మార్పులు వల్ల ఇలా సంభవిస్తాయా? దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం.


సహజంగా ఆడవాళ్లు ఎక్కువసేపు నీళ్లలో నానుతుంటారు. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు గానీ, బట్టలు ఉతికేటప్పుడు గానీ ఎక్కువ సేపు నీళ్లలో ఉంటారు. దీంతో చేతులు, అరకాళ్లు ముడతలు పడుతుంటాయి. ఇక చెరువుల్లో, సముద్రాల్లో ఎక్కువసేపు స్నానం చేసే వారికి కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఒక విషయం ఏంటంటే ఒళ్లంతా సాధారణంగా ఉన్నప్పటికీ అరిచేతులు, చేతి వెళ్ల వద్ద మాత్రం మార్పు వస్తుంది. కాలి వేళ్లు, అరికాళ్ల వద్ద కూడా ముడతలు వస్తుంటాయి. వాటి ఆకారం మారిపోతుంది. అయితే ఈ ముడతలు అనేవి తాత్కాలికంగా వచ్చి మళ్లీ పోతాయి. అయితే వీటి వల్ల ఏ హాని ఉండదు. కానీ అసలెందుకు ఈ ముడతలు పడుతుంటాయి. ఎక్కువ సేపు నీళ్లలో ఉండటం వల్ల ఇలా జరుగుతుందా? మరేదైనా కారణం ఉందా?


రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాళ్లు లేదా చేతులు నీళ్లలో చాలా సేపు నానడం వల్ల చర్మం కింద ఉన్న నాడులు(సింపాథిటిక్ నాడీ వ్యవస్థ) స్పందించి.. చర్మంలోని రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా.. రక్త నాళాలు కుంచిచుకుపోవడంతో చర్మం కింద ఖాళీ ఏర్పడి.. ముడతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. దీని వల్ల తడి వస్తువులను పట్టుకునేందుకు మంచి పట్టుదొరుకుతుందని కూడా చెబుతున్నారు. పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పుల్లో ఇదీ ఒకటి అని వారు అంటున్నారు.

Updated Date - 2021-12-23T22:02:30+05:30 IST