స్విట్జర్లాండ్ ఆర్మీ చీఫ్ థామస్ సుస్లీకి కరోనా

ABN , First Publish Date - 2020-10-20T11:13:56+05:30 IST

స్విట్జర్లాండ్ ఆర్మీ చీఫ్ థామస్ సుస్లీకి కరోనా పాజిటివ్ అని తేలింది.

స్విట్జర్లాండ్ ఆర్మీ చీఫ్ థామస్ సుస్లీకి కరోనా

బెర్ను (స్విట్జర్లాండ్): స్విట్జర్లాండ్ ఆర్మీ చీఫ్ థామస్ సుస్లీకి కరోనా పాజిటివ్ అని తేలింది. స్విస్ సైనిక ప్రధానాధికారి థామస్ సుస్లీకి కరోనా వైరస్ అని పరీక్షల్లో నిర్ధారణ కావడంతో అతను సోమవారం నుంచి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన వ్యక్తితో ఆర్మీ చీఫ్ కలిసి ఉన్నందున అతను కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో థామస్ కు కూడా కరోనా ఉందని తేలింది. థామస్ సుస్లీకి కరోనా లక్షణాలు లేవని, ఇంటినుంచి పనిచేస్తూనే ఉన్నారని స్విస్ ప్రభుత్వం తెలిపింది. కరోనా బారిన పడిన ఆర్మీ చీఫ్ థామస్ వయసు 54 సంవత్సరాలు. ఈయన ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి స్విస్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. 

Updated Date - 2020-10-20T11:13:56+05:30 IST