నిమిషానికి షాకింగ్ స్థాయిలో ఆర్డర్‌లు పొందిన స్విగ్గీ, జొమాటో

ABN , First Publish Date - 2022-01-01T17:38:41+05:30 IST

న్యూ ఇయర్ అంటేనే.. మందు, విందు. డిసెంబర్ 31 రోజున సంబరాలు అంబరాన్నంటుతాయి.

నిమిషానికి షాకింగ్ స్థాయిలో ఆర్డర్‌లు పొందిన స్విగ్గీ, జొమాటో

న్యూ ఇయర్ అంటేనే.. మందు, విందు. డిసెంబర్ 31 రోజున సంబరాలు అంబరాన్నంటుతాయి. అయితే కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ మాత్రం కాస్తో కూస్తో కొత్త సంవత్సర వేడుకలపై పడిందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంటిలోపలే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేశారు. దీంతో రికార్డ్ స్థాయిలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలకు ఆర్డర్లు వెల్లువెత్తాయి.  భారతదేశంలోని ప్రముఖ ఫుడ్ టెక్ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గిలకు నిమిషానికి ఎన్ని ఆర్డర్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవక మానరు. 


నిమిషానికి ఎన్ని ఆర్డర్‌లంటే..


డిసెంబర్ 31, 2021 రాత్రి 8:20 గంటల నాటికి జొమాటో నిమిషానికి గరిష్టంగా 7,100 ఆర్డర్‌లను పొందగా,  స్విగ్గీ నిమిషానికి 9,000 ఆర్డర్‌లకు పైనే సంపాదించింది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా రోజుకు 1.5 మిలియన్ ఆర్డర్‌లను అందుకుంటూ ఉంటాయి. జొమాటో మునుపటి రికార్డు నిమిషానికి 4,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు కాగా, స్విగ్గీ గత నూతన సంవత్సర పండుగ సందర్భంగా నిమిషానికి 5,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లను సాధించింది. రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఒక్కొక్కటి 2 మిలియన్లకు పైగా ఆర్డర్‌లను పొందాయి. సాధారణంగా ఒక రోజులో ఇవి 1.3-1.5 మిలియన్లను క్లాక్ చేస్తాయి.

Updated Date - 2022-01-01T17:38:41+05:30 IST