స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం

ABN , First Publish Date - 2022-08-11T06:15:42+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం

 మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 10 : ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా 15వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందామని జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు, పురాతన కట్టడాలు అలంకరించాలన్నారు. పింగళి వెంకయ్య, సిద్ధేంద్ర యోగి, భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహాలు, ఘంటసాల, గుడివాడలో బౌద్ధ అవశేషాలు, బందరు పోర్టు, మొవ్వలో వేణుగోపాలస్వామి ఆలయం, అవనిగడ్డలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం,  బంటుమిల్లి మండలం ముంజులూరులో బౌద్ధ ఆల యం, శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వరుని ఆలయం అలంక రించాలన్నారు.  డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

మల్లవోలు హైస్కూల్‌లో విద్యార్థులు జాతీయ గీతాలకు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి వరాహ గిరి వెంకటగిరి సేవలు మరచిపో లేమని జిల్లా అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎన్‌. వెంకట రామాంజనేయులు అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో వీవీ గిరి చిత్రపటానికి ఏఎస్పీ ఎన్‌. వెంకట రామాంజనేయులు, ఏఎస్సీ (ఎస్‌ఇబి) అస్మాన్‌ ఫర్హీన్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

పెడన రూరల్‌ :  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాజులపాటి వాణి, ఎంపీడీవో రామనాథం  తదితరులు భారత మాజీ రాష్ట్రపతి వీవీ గిరి చిత్రపటానికి పూలమాలువేసి నివాళులర్పించారు.  నందిగం, చేవేండ్ర, చెన్నూరు, నందమూరు, బల్లిపర్రు పంచాయతీల్లో వీవీ గిరికి నివాళులర్పించారు. 

చల్లపల్లి :  నారాయణరావు నగర్‌ కాలనీలో తిరంగా వేడుకలు నిర్వహించారు. గాంధీ భక్తునిగా పేరొందిన వర్తకసంఘ ప్రముఖుడు తమ్మన బాబూరాజేంద్ర ప్రసాద్‌ ఆధ్వర్యంలో  మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నివాళులు అర్పించారు.  వాసవీక్లబ్‌ మాజీ అధ్యక్షుడు తమ్మన సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఘంటసాల : బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామి ఆలయం నుంచి కృషి విజ్ఞాన కేంద్రం వరకు స్వాతంత్య్ర స్ఫూర్తితో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేవీకే సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.వై.వి.ఎస్‌.మనోహరరావు, జలవనరుల శాఖ ఈఈ శ్రీనివాసరావు, కేవీకే ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.శ్రీలత తదితరులు మాట్లాడారు.   

  మండలంలోని పలు సచివాలయాల వద్ద మాజీ రాష్ట్రపతి వీవీ గిరి జయంతిని నిర్వహించారు. మల్లం పల్లి, దేవరకోట, కొడాలి, తాడేపల్లి, చిట్టూర్పు, చినకళ్లేపల్లి, తెలుగురావుపాలెం  గ్రామాల్లో వీవీ గిరి చిత్రపటానికి సర్పంచ్‌లు నివాళులర్పించారు. 

అవనిగడ్డ టౌన్‌: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ పిలుపు మేరకు   అవనిగడ్డలో జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి లింగా సుధాకర్‌, విజయవాడ సిటీ కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యు.జోసెఫ్‌, అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దిడ్ల రాఘవులు, కోసూరి రామాంజ నేయులు, ముత్తిరెడ్డి వెంకటేశ్వరరావు, భీమా శ్రీనివాసరావు, మీర్‌ రిజ్వాన్‌, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు నాగరాజ్యం, నేతలు కాగితాల సుదర్శన్‌, ఆది రామ్మోహనరావు, షేక్‌ గౌస్‌, అవనిగడ్డ రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

అవనిగడ్డ రూరల్‌: అశ్వారావుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో వివిధ వేషధారణలతో విద్యార్థులు అలరించారు.  ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు ఎస్‌.టి.పి.కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామచంద్రపురం సచివాలయంలో వీవీ గిరి జయంతిని పురస్కరించుకుని సర్పంచ్‌ వాకా రమేష్‌, పంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు గిరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

 అవనిగడ్డ టౌన్‌ :హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం అవనిగడ్డ శాఖా గ్రంథాలయంలో బుధవారం ప్రారంభించారు.  కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకురాలు వీరకుమారి,  పాల్గొన్నారు.

నాగాయలంక : ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా నాగాయలంకకు చెందిన సామా జిక కార్యకర్తలు శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌ ఒడ్డున రెండు పడవలకు తెరచాపలుగా జాతీయ జెండాలను అలంకరించి తమ దేశభక్తిని చాటుకు న్నారు. ఘాట్‌ను సందర్శించే ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదంతోపాటు ఉత్తేజాన్ని ఆస్వాదిస్తున్నారు. జలక్రీడలకు వినియోగించే పడవలకు త్రివర్ణ పతాకాలతో ముస్తాబు చేశారు. 

Updated Date - 2022-08-11T06:15:42+05:30 IST