Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోస్టాఫీసులో ఖాతాదారుల సొమ్ము స్వాహా

సింహాద్రిపురం, డిసెంబరు 4: బలపనూరు సబ్‌ పోస్టాపీసులో ఖాతాదారుల సొమ్ము సిబ్బందిలో ఒకరు స్వాహా చేసినట్లు బాధితు లు తెలిపారు. శనివారం పోస్టాఫీ సులో బాధితులు విలేకరులకు వి వరాలు తెలిపారు. పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామి అనే వ్యక్తి మా నుంఇ వేలిముద్రలు తీసుకుని మా ఖాతాలో ఉన్న సొమ్ము విత్‌డ్రా చేసుకున్నట్లు ఆరోపించారు. విత్‌డ్రా చేసిన సొమ్ము మాకు ఇవ్వకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి నారాయణస్వామి పరారైనట్లు బాధితులు తెలిపారు. బి.కళావతి రూ.70 వేలు, కె.ఈశ్వరమ్మరూ.75 వేలు, పి.అలేఖ్య రూ.50 వేలు, ఫరవీన్‌ రూ.40 వేలు, కె.కళావతి రూ.30 వేలు, కె.ప్రమీల రూ.25 వేలు మోసపోయినట్లు బాధితులు తెలిపారు. నారాయణస్వామిపై సింహాద్రిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. ఖాతాదారులను మోసం చేసిన నారాయణస్వామిపై పోస్టల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, అతడిపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పోస్ట్‌మాస్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement