జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-21T05:21:14+05:30 IST

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు.

జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం
పాలకొల్లులో స్వచ్ఛ సంకల్పం ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్‌ కవురు

భీమవరం రూరల్‌/పెనుగొండ/ఆచంట/పాలకోడేరు/నరసాపురం రూరల్‌ /పోడూరు, అక్టోబరు 20 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ పాలకవర్గాలు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. భీమవరం, పెనుగొండ, ఆచంట, పాల కోడేరు, నరసాపురం, పోడూరు మండల పరిషత్‌ సమావేశ మందిరాల్లో బుధవారం జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని వంద రోజుల పాటు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారని డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు తెలిపారు. పారిశుధ్యంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పెనుగొండ ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు, సర్పంచ్‌ నక్కా శ్యామలా సోని అన్నారు. ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత పాటించి తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆచంట ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రతీ ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని పాలకోడేరు ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు, జడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీ తులసి అన్నారు.  గ్రామాల్లో జరిగే కార్యక్రమాలపై నరసాపురం ఎంపీడీవో ప్రసాద్‌యాదవ్‌ ప్రజాప్రతి నిధులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేయాలని పోడూరు జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీ సబ్బితి సుమంగళి అన్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ ఛైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు, కామన నాగేశ్వరరావు, తహసీల్దార్‌ ఏవి రమణరావు, ఎంపీ డీవో జి.పద్మ, పెనుగొండ సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షురాలు దండు పద్మా వతి,ఈవోపీఆర్‌డీ వెంకటరెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌,  ఏఎంసీ  చైర్మన్‌ సుంకర ఇందిరా సీతారాం, వైస్‌ ఎంపీపీ యర్రగొప్పుల నాగరాజు, సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు సుంకర  సీతారామ్‌, తహసీల్దార్‌ నజీముల్లాషా, ఎంపీడీ వో కె.కన్నమనాయుడు,తహసీల్దార్‌ పి.ప్రతాపరెడ్డి పాల్గొన్నారు

Updated Date - 2021-10-21T05:21:14+05:30 IST