ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛభారత్‌ సాధ్యం

ABN , First Publish Date - 2021-02-27T05:54:46+05:30 IST

స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు వేగవంతంగా జరగాలంటే అందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సహస్‌, యూనిసెఫ్‌ కేంద్ర కమిటీ బృందం సభ్యుడు శివ సూచించారు.

ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛభారత్‌ సాధ్యం
సమావేశంలో మాట్లాడుతున్న బృందం సభ్యుడు శివ

పామూరు, ఫిబ్రవరి 26: స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు వేగవంతంగా జరగాలంటే అందులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని సహస్‌, యూనిసెఫ్‌ కేంద్ర కమిటీ బృందం సభ్యుడు శివ సూచించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్వచ్ఛ పామూరుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అందుకోసం వార్డు శానిటైజేషన్‌ కమిటీని ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న పలువురు నేతలు మాట్లాడుతూ పామూరులో తక్షణమే సులభకాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని, కేంద్రబృందం సభ్యులకు వివరించారు. అనంతరం చెత్త నుండి సంపద కేంద్రాన్ని బృందం సభ్యులు సందర్శించారు. అక్కడ నిరుపయోగంగా పడిఉన్న చెత్త రిక్షాలను, కట్టర్‌ మిషన్‌లు, కంపోస్టు ఎరువును పరిశీలించి అంసతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రంగసుబ్బారాయుడు, ఈవోపీఆర్‌డీ వి.బ్రహ్మానందరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ పౌల్‌ రాజు, విద్యుత్‌ ఏఈ రమణారెడ్డి, పీఆర్‌ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు, ఏపీఎం జి.విద్యాసాగర్‌, ఏపీవో సమీర్‌బాషా, వైసీపీ నాయకులు గంగసాని హుస్సేన్‌రెడ్డి, చప్పిడి.సుబ్బయ్య, మాజీ సర్పంచ్‌ డీవీ.మనోహర్‌, కె రామిరెడ్డి, ఉప సర్పంచ్‌ వైవీ.సాయికిరణ్‌, చెన్నికల శ్రీను, గట్లా విజయభాస్కర్‌రెడ్డితో పాటు వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు వలంటీర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:54:46+05:30 IST