స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం : డీపీవో

ABN , First Publish Date - 2022-05-26T03:31:30+05:30 IST

జగనన్న స్వచ్ఛ సంకల్పంతో జిల్లాలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీపీవో ధనలక్ష్మి తెలిపారు.

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం : డీపీవో
సచివాలయ సిబ్బంది సమావేశంలో మాట్లడుతున్న డీపీవో ధనలక్ష్మి

సంగం, మే 25: జగనన్న స్వచ్ఛ సంకల్పంతో జిల్లాలోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు డీపీవో ధనలక్ష్మి తెలిపారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సచివాలయ సిబ్బంది సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రతి పంచాయతీలో చెత్త సేకరణకు జిల్లా వ్యాప్తం గా 850 ట్రైసైకిళ్లను పంపిణీ చేశామన్నారు. గ్రీన్‌ అంబాసిడర్లను ఏర్పాటు చేసి జీతాలు కూడా ఇస్తున్నామన్నారు. వీరందరిచేత గ్రామాల్లో చెత్త సేకరించి డంపింగ్‌ యార్డ్‌లకు తరలిస్తున్నామన్నారు.  జిల్లాలోని 350 సచివాలయాలకు ఆధార్‌ పరికరాలను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఇప్పటికే కొన్ని సచివాలయాల్లో ఆధార్‌ నమోదు పక్రియ ప్రారంభించామన్నారు.పంచాయతీ అనుమతి లేకుండా ఎవరూ నిధులు తీసుకోకుండా పంచాయతీ కార్యదర్శికి, సర్పంచుకు డిజిటల్‌ కీ ఇవ్వడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ అప్పాజీ, సచివాలయ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్‌లు, వేల్ఫేర్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T03:31:30+05:30 IST