వెల్వర్తి సర్పంచ, ఉపసర్పంచ, కార్యదర్శిపై సస్పెన్షన వేటు

ABN , First Publish Date - 2021-05-13T07:33:52+05:30 IST

మండలంలోని వెల్వర్తి గ్రామ సర్పంచ, ఉపసర్పంచ, పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షనవేటు పడింది.

వెల్వర్తి సర్పంచ, ఉపసర్పంచ, కార్యదర్శిపై సస్పెన్షన వేటు

వలిగొండ, మే 12: మండలంలోని వెల్వర్తి గ్రామ సర్పంచ, ఉపసర్పంచ, పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షనవేటు పడింది. గ్రామ సర్పంచ పసల అన్నమేరి, ఉపసర్పంచ తక్కెళ్ల శ్రావణి, పంచాయతీ కార్యదర్శి తుమ్మల ఆనంద్‌కుమార్‌ ను ఆరుమాసాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో గీతారెడ్డి విలేఖరులకు తెలిపారు. గ్రామ పంచాయతీ తీర్మాణం  లేకుండానే రూ.7.10లక్షల గ్రామ పంచాయతీ నిధుల నుంచి డ్రా చేశారని, రూ.31,14,486 చెక్‌ మెజర్‌ లేకుండానే పనుల చెల్లింపులు చేసి, సర్పంచ, ఉపసర్పంచ అధికార దుర్వినియోగంకు పాల్పడినట్లు రుజువైందని ఎంపీడీవో తెలిపారు. విధి నిర్వాహణలో సర్పంచ, ఉపసర్పంచకు సహకరించినందుకు పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసినట్లు ఆమె వివరించారు.

Updated Date - 2021-05-13T07:33:52+05:30 IST