ఎంటీ జూనియర్ కళాశాల వద్ద ఉన్న చేతబడి సామగ్రి
నూజివీడు టౌన్, మే 16: నూజివీడు మడుపల్లి తాతయ్య జూనియర్ కళాశాల వద్ద పడవేసిన చేతబడి వస్తువులు ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపాయి. కళాశాల సమీపంలో నిమ్మకాయలు, అన్నం ముద్ద, ఎండు మిర్చి, మేకు, బొమ్మ తదితర వస్తువులను పడవేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే బాలికల వసతి గృహం ఉండటం, కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సమ యంలో ఈ విధంగా అనుమానాస్పద వస్తువులు పడవేయడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.