సుశాంత్‌ పోస్ట్‌మార్టంపై సీబీఐకి ఎయిమ్స్‌ నివేదిక

ABN , First Publish Date - 2020-09-29T19:54:08+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

సుశాంత్‌ పోస్ట్‌మార్టంపై సీబీఐకి ఎయిమ్స్‌ నివేదిక

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ఎయిమ్స్ నివేదిక చర్చనీయాంశమవుతోంది. సుశాంత్ పోస్టుమార్టంపై ఎయిమ్స్ వైద్య బృందం సీబీఐకి ఒక నివేదిక ఇచ్చింది. సుశాంత్ మృత దేహంలో విషపదార్థాలు లేవని ఆ నివేదికలో పొందుపరిచింది. 


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్యేనని, ఉరి వేసుకోవడంతోనే చనిపోయాడని ఎయిమ్స్ ఆ నివేదికలో స్పష్టం చేసింది. సుశాంత్ మృత దేహంలో అవయవాలన్నీ పరిశీలించిన తర్వాతే ఈ నివేదిక ఇచ్చామని ఎయిమ్స్ తెలిపింది. ఎయిమ్స్ నివేదిక అందుకున్న సీబీఐ అధికారులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఫోరన్సిక్ రిపోర్టు కోసం సీబీఐ ఎదరు చూస్తోంది.


కాగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సోవిక్ చక్రవర్తి ముంబై హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో రియాకు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. రియా డ్రగ్స్ వాడిందని ఎన్సీబీ అభియోగాలు మోపింది. ఆమెకు డ్రగ్స్ స్మగ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు చేసింది, సరఫరా చేసింది రియానేనని ఎన్సీబీ పేర్కొంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసిన ఎన్సీబీ.. మరింతమందిని విచారించేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - 2020-09-29T19:54:08+05:30 IST